ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్దం, దానికి ప్రతిగా ఆ దేశం చేస్తున్న ప్రతిదాడులు భారత్ పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అంతా ఊహించినట్లుగానే గ్యాస్ ధరల మంట (LPG Price hike) ప్రారంభమైంది. హార్ముజ్ జలసంధి నుంచి ఎల్బీజీ సరఫరాలపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో కేంద్రం గ్యాస్ ధరలు పెంచేసింది. ఇవాళ్టి నుంచి ఇళ్లకు వాడే సిలెండర్లతో పాటు వాణిజ్య సిలెండర్లపైనా భారీగా రేట్లు పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి
దేశవ్యాప్తంగా *14.2 కిలోల గృహోపకరణాల వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.60 పెరిగింది*. అదేవిధంగా *19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర కూడా రూ.115 పెరిగింది*. దీని ప్రభావం హోటళ్ళు, రెస్టారెంట్లు, చిన్న వాణిజ్య సంస్థలపై పడబోతోంది. పెరిగిన గ్యాస్ సిలెండర్ ధరలు ఇవాళ్టి నుంచే అమల్లోకి వస్తున్నాయి. ఢిల్లీలో 14.2 కిలోల గృహోపకరణాల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.853 నుండి రూ.913 కు పెరిగింది. ముంబైలో కొత్త రేటు ఇప్పుడు రూ.852.50గా ఉంది. కోల్కతాలో ధర రూ.879 నుండి రూ.030 కు పెరిగింది. చెన్నైలో ఇది రూ.868.50 నుండి రూ.928.50 కు పెరిగింది.