*💥ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో స్మాల్ సర్క్యులేషన్ పత్రికల తరఫున నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA) రిట్ పిటిషన్*

*@-జర్నలిస్టుల స్వయంపోరాటానికి ఒక చారిత్రాత్మక అడుగు.*

*⭐ ప్రత్యేకత – పార్టీ–ఇన్–పర్సన్‌గా జర్నలిస్టే న్యాయపోరాటం*

*🔴 అక్రిడేషన్ = వృత్తిపరమైన గుర్తింపు*

*🔴 ఎంపానెల్‌మెంట్ = ప్రకటనల పరిపాలనా ప్రక్రియ*

*⚖️ సహజ న్యాయ సూత్రాల ఉల్లంఘన*

*📜 మౌలిక హక్కుల ఉల్లంఘన*

*🟢 అక్రమంగా ఏర్పాటు చేసిన అక్రిడేషన్ కమిటీలు*

*✍️ ఈ రిట్ పిటిషన్ రాష్ట్రవ్యాప్తంగా చిన్న పత్రికలు, గ్రామీణ జర్నలిస్టుల భవిష్యత్తుకు సంబంధించిన కీలక అంశంగా మారింది. ఈ వ్యవహారంపై హైకోర్టు తీర్పు కోసం మీడియా వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.*

*అమరావతి :* ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియా అక్రిడేషన్ వ్యవస్థను ప్రకటనల ఎంపానెల్‌మెంట్‌తో అనుసంధానం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సవాల్ చేస్తూ, నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA) ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించింది.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ కింద దాఖలైన ఈ రిట్ పిటిషన్‌ను, నేషనల్ యాక్టివ్ రిపోర్టర్ అసోసియేషన్ (NARA) దాఖలు చేసి పార్టీ–ఇన్–పర్సన్‌గా వాదిస్తున్నారు.

*🔴 అక్రిడేషన్ = వృత్తిపరమైన గుర్తింపు*

*🔴 ఎంపానెల్‌మెంట్ = ప్రకటనల పరిపాలనా ప్రక్రియ*

పిటిషన్ లో ప్రధానంగా ప్రభుత్వం జారీచేసిన జీవోను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరారు.. ఈ జీవో ద్వారా రాష్ట్రస్థాయి మీడియా అక్రిడేషన్‌కు I&PR ఎంపానెల్‌మెంట్ తప్పనిసరి చేయడం చట్టవిరుద్ధమని పిటిషనర్ వాదించారు.

అక్రిడేషన్ అనేది జర్నలిస్టు వృత్తికి సంబంధించిన గుర్తింపు కాగా, ఎంపానెల్‌మెంట్ అనేది ప్రభుత్వ ప్రకటనల పంపిణీకి సంబంధించిన పరిపాలనా ప్రక్రియ అని, ఈ రెండు భిన్నమైన అంశాలను కలిపివేయడం Colourable Exercise of Power కు ఉదాహరణ అని పిటిషన్‌లో పేర్కొన్నారు.

*🟠 చిన్న పత్రికలపై పూర్తి బహిష్కరణ*

ఈ జీవో ఆధారంగా రూపొందించిన వెబ్ పోర్టల్‌లో, ఎంపానెల్‌మెంట్ లేని చిన్న సర్క్యులేషన్ పత్రికలకు రాష్ట్రస్థాయి అక్రిడేషన్‌కు అప్లై చేసే అవకాశాన్నే తొలగించారని పిటిషనర్ ఆరోపించారు. పోర్టల్‌లో “Not Eligible” అని చూపిస్తూ, జిల్లాస్థాయికి మాత్రమే పరిమితం చేయడం వల్ల 600కు పైగా చిన్న పత్రికలు పూర్తిగా వ్యవస్థ వెలుపలికి నెట్టబడ్డాయని వివరించారు.

*⚖️ సహజ న్యాయ సూత్రాల ఉల్లంఘన*

గతంలో చెల్లుబాటు అయ్యే అక్రిడేషన్ కలిగిన పత్రికలను కూడా: ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, వినే అవకాశం కల్పించకుండా, అకస్మాత్తుగా వెబ్ పోర్టల్ నుండి తొలగించడం
👉 సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని, అలాగే ఇది Retrospective Civil Consequences విధించడం అవుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

*📜 మౌలిక హక్కుల ఉల్లంఘన*

ప్రభుత్వ చర్యల వల్ల: యాదృచ్ఛికత, వివక్ష, పత్రికా స్వేచ్ఛపై chilling effect, ఆర్టికల్ వృత్తి నిర్వహణపై ఆంక్ష, జీవనోపాధి, గౌరవ హక్కులు ఉల్లంఘించబడ్డాయని పిటిషనర్ పేర్కొన్నారు.

*🟢 అక్రమంగా ఏర్పాటు చేసిన అక్రిడేషన్ కమిటీలు*

రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలలో ఏర్పాటు చేసిన మీడియా అక్రిడేషన్ కమిటీలను కూడా పిటిషన్‌లో తీవ్రంగా తప్పుబట్టారు.
ఎటువంటి: పబ్లిక్ నోటిఫికేషన్ లేకుండా, అర్హత ప్రమాణాలు ప్రకటించకుండా, ప్రధాన జర్నలిస్టు సంఘాలను పక్కనపెట్టి, కొన్ని అనుకూల సంఘాలనే ఏకపక్షంగా ఎంపిక చేసి కమిటీలను ఏర్పాటు చేయడం యాదృచ్ఛికం, పక్షపాతంతో కూడినది, పారదర్శకత లేనిదని ఆరోపించారు.

ఇది “Nemo judex in causa sua” అనే సహజ న్యాయ సూత్రానికి విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు.

*📌 హైకోర్టును కోరిన అంశాలు*

పిటిషన్‌లో ప్రధానంగా: G.O. Ms. No.84 (19-08-2025) ను రద్దు చేయాలని, ఎంపానెల్‌మెంట్ లేకున్నా రాష్ట్రస్థాయి అక్రిడేషన్‌కు అప్లై చేసే అవకాశం ఇవ్వాలని, గతంలో రద్దు చేసిన అక్రిడేషన్‌లను పునరుద్ధరించాలని, అక్రమంగా నియమించిన రాష్ట్ర & జిల్లా అక్రిడేషన్ కమిటీలను రద్దు చేయాలని, పారదర్శక విధానంతో కొత్త కమిటీలను ఏర్పాటు చేయాలని హైకోర్టును కోరారు.

*⏳ మధ్యంతర ఉపశమనం కోరుతూ*

రిట్ పిటిషన్ తుది తీర్పు వచ్చే వరకు: అక్రిడేషన్ నిరాకరణ / రద్దుపై స్టే విధించాలని, ప్రభావిత జర్నలిస్టులకు తాత్కాలిక పాస్‌లు ఇవ్వాలని పిటిషనర్ కోర్టును కోరారు.

*✍️ ఈ రిట్ పిటిషన్ రాష్ట్రవ్యాప్తంగా చిన్న పత్రికలు, గ్రామీణ జర్నలిస్టుల భవిష్యత్తుకు సంబంధించిన కీలక అంశంగా మారింది. ఈ వ్యవహారంపై హైకోర్టు తీర్పు కోసం మీడియా వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.*

*⭐ ప్రత్యేకత – పార్టీ–ఇన్–పర్సన్‌గా జర్నలిస్టే న్యాయపోరాటం*

ఈ రిట్ పిటిషన్‌లో మరో అత్యంత విశేషమైన అంశం ఏమిటంటే, ఎటువంటి అడ్వకేట్ సహాయం లేకుండా, చిన్న సర్క్యులేషన్ పత్రికలు, గ్రామీణ జర్నలిస్టులు, స్వతంత్ర మీడియా ప్రతినిధులు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి, ఒక జర్నలిస్టు హోదాలోనే జర్నలిస్టుల సమస్యలను జర్నలిస్టే స్వయంగా హైకోర్టు ముందు పార్టీ–ఇన్–పర్సన్‌గా వాదించడమే. రాష్ట్రంలో ఇప్పటివరకు ఏ జర్నలిస్టు యూనియన్ కూడా ఈ విధంగా అక్రిడేషన్ వ్యవస్థపై, మౌలిక హక్కుల ఉల్లంఘనలపై పార్టీ–ఇన్–పర్సన్‌గా హైకోర్టును ఆశ్రయించిన స్పష్టమైన చరిత్ర లేదని మీడియా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వృత్తి అనుభవం, గ్రౌండ్ రియాలిటీ, గ్రామీణ జర్నలిస్టుల రోజువారీ సాధక బాధలపై ప్రత్యక్ష అవగాహనతో న్యాయస్థానం దృష్టికి ఈ అంశాలను తీసుకెళ్లడం జర్నలిస్టుల హక్కుల పోరాటంలో ఒక చారిత్రాత్మక అడుగుగా నిలుస్తుందని పేర్కొంటున్నారు.